ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు వేదిక పనులను పర్యవేక్షించాలి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-11-25T08:08:03+05:30

రైతు వేదిక పనులను దగ్గర ఉండి పూర్తి చేయించాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మసాగర్‌, నవంబరు 24 :  రైతు వేదిక పనులను దగ్గర ఉండి పూర్తి చేయించాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు అన్నారు.  మంగళవారం ధర్మసాగర్‌, ఎలుకుర్తి, నారాయణగిరిగ్రామాల్లో నిర్మాణంలో ఉన్న రైతు వేదిక పనులను కలెక్టర్‌  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధర్మసాగర్‌లో బుధవారం నుంచి భవనం బయట ప్లాస్టింగ్‌ పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పనులు సకాలంలో పూర్తి  చేసి ప్రారంభోత్సవాలు జరగాలంటే దగ్గరుండి పనులు చేయించాలని ఏఈ దయానంద్‌కు కలెక్టర్‌ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రం ఎక్కడ ఉందని, ధాన్యం కొనుగోలు చేస్తున్నారా అని ఏపీఎం అనితను అడిగి తెలుసుకున్నారు.


రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకరాకపోవడం వల్ల  మిల్లర్లు ధాన్యాన్ని తీసుకోవడం లేదని  ఆమె కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చింది. దీంతో వెంటనే కలెక్టర్‌ సంబంధిత మిల్లర్లతో మాట్లాడాలని పీఏకు సూచించారు.  కార్యక్రమంలో డీఆర్‌డీవో పీడీ శ్రీనివాస్‌, ఎంపీడీవో జవహర్‌రెడ్డి, ఏఈ దయానందచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-25T08:08:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising