ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవాలయ భూములను పరిరక్షిస్తాం: ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-07-29T22:18:52+05:30

దేవాదాయ భూముల ప‌రిర‌క్ష‌ణ‌పై మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి స‌మీక్ష‌ నిర్వహించారు. దేవాదాయ భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దేవాదాయ భూముల ప‌రిర‌క్ష‌ణ‌పై మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి స‌మీక్ష‌ నిర్వహించారు. దేవాదాయ భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, ఆలయ భూముల ఆక్రమణదారులను ఉపేక్షించేది లేదని ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తుల లీజుల విషయంలో  కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. నామమాత్రపు ధరకు దేవాదాయ శాఖకు సంబంధించిన షాపులను లీజుకు తీసుకొని తిరిగి వాటిని అధిక అద్దెకు సబ్‌ లీజుకు ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లీజ్‌ నిబంధనలు మార్చి  దేవాదాయ శాఖ‌కు మరింత ఆదాయం వచ్చేలా చూడాలని అధికారులన్నారు. దశాబ్దాల క్రితం నాటి లీజ్ ల‌తోఆ పాటు  అద్దెల విషయంలో కూడా పునఃసమీక్ష చేసుకోవాలని చెప్పారు. ఆలయ భూముల ద్వారా వచ్చే ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించాలని ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సూచించారు. హైద‌రాబాద్ ప‌రిధిలో రూ. 55 కోట్ల వ్య‌యంతో 13 ప్రాంతాల్లో నిరుప‌యోగంగా ఉన్న దేవాదాయ భూముల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు, క‌ల్యాణ మండ‌పాల నిర్మాణానికి ప్ర‌ణాళిక‌లు రూపొందించామ‌ని దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్ ఈ సంద‌ర్భంగా మంత్రికి వివ‌రించారు.  

Updated Date - 2020-07-29T22:18:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising