శానిటైజర్ల పంపిణీకి ప్రయత్నిస్తున్నాం: భట్టి
ABN, First Publish Date - 2020-03-27T09:53:51+05:30
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఫార్మా కంపెనీలతో శానిటైజర్లను ఉత్పత్తి చేయించి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయించే ప్రయత్నం కాంగ్రెస్
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఫార్మా కంపెనీలతో శానిటైజర్లను ఉత్పత్తి చేయించి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ పక్షాన చేస్తున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ బాధ్యతను మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌కు అప్పగించామని ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో శానిటైజర్లు దొరకడం లేదని, ముఖ్యంగా గ్రామీణ ప్రజానీకానికి ఇవి అందుబాటులో లేవని అన్నారు.
Updated Date - 2020-03-27T09:53:51+05:30 IST