ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిండు కుండల్లా ప్రాజెక్టులు

ABN, First Publish Date - 2020-10-15T06:50:16+05:30

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ఆలమట్టి డ్యాంలోకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌, అక్టోబరు 14: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ఆలమట్టి డ్యాంలోకి బుధవారం సుమారు 1.17 క్యూసెక్కుల లక్షల వరద చేరింది. డ్యాం నుంచి 1.70 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో, అది నారాయణపూర్‌ మీదుగా జూరాలకు చేరుతోంది. జూరాల నుంచి బుధవారం 2.73 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో శ్రీశైలంలోకి చేరుతోంది. అలాగే శ్రీశైలం నుంచి 3.44 లక్షల క్యూసెక్కులు, నాగార్జునసాగర్‌ నుంచి 2.73 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి బేసిన్‌లోనూ భారీగా వరద ప్రవాహం నమోదవుతోంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు 30 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండటంతో సింగూరు ప్రాజెక్టు ఐదు గేట్లను ఎత్తి.. నిజాంసాగర్‌లోకి విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం 1,399 అడుగులకు చేరుకుంది. నిజామాబాద్‌ జిల్లా శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. 63 వేల ఇన్‌ఫ్లో రావడంతో 25 వేల క్యూసెక్కులను ప్రాజెక్టులోకి విడుదల చేశారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, చెరువులు, కుంటలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని ఉన్నతాధికారులు స్థానిక ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2020-10-15T06:50:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising