ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బతికుండగానే బావిలోకి...గొర్రెకుంట మృతుల పోస్టుమార్టం రిపోర్టు

ABN, First Publish Date - 2020-05-23T15:37:38+05:30

బతికుండగానే బావిలోకి...గొర్రెకుంట మృతుల పోస్టుమార్టం రిపోర్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: జిల్లాలోని గొర్రెకుంట బావిలో బయటపడ్డ తొమ్మిది మృతదేహాలకు శనివారం పోస్టు‌మార్టం పూర్తి అయ్యింది. ప్రాణం ఉండగానే నీటిలో పడి చనిపోయినట్టు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. విషప్రయోగమా? మత్తు మందు ఇచ్చారా అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులు షకీల్, యాకూబ్ ఫోన్సే కీలకంకానున్నాయి. కాల్ డేటా ఆధారంగా వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. మక్సూద్ కూతురు బూస్రాకు ఉన్న అక్రమ సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ప్రత్యేక బృందాలతో సీపీ సమావేశమయ్యారు. 


మిస్టరీ చేధనకు అన్ని దారుల్లో విచారణ తీవ్రతరం

తొమ్మిది మంది మృతి మిస్టరీని చేధించేందుకు పోలీసులు అన్ని దారుల్లో విచారణ తీవ్రతరం చేశారు. కేసులో మహ్మద్ మక్సూద్ ఆలంకు సన్నిహితుడైన డ్రైవర్ షకీల్ అహ్మద్, మక్సూర్ కూతురు బుస్రా ఖాతూన్‌తో‌‌ వివాహేతర సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఘటనలో షకీల్ సెల్‌ఫోన్‌పై దృష్టి సారించిన పోలీసులు కాల్ డేటాను సేకరిస్తున్నారు.  బుస్రా ఖాతూన్ ప్రియుడిగా అనుమానం ఉన్న మిద్దెపాకయాకూబ్‌ను పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. బీహార్‌కే చెందిన దర్భంగా జిల్లా కేవిట్ తాలూకా సిసోనా వాసి సంజయ్ కుమార్ యాదవ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గొర్రెకుంట ఘటనలో మృతి చెందిన తొమ్మిది మందిలో ఏడుగురి సెల్‌ఫోన్ల ఆచూకీపై టెన్షన్ నెలకొంది. మృతుల ఫోన్ నంబర్లను పోలీసులు ప్రకటించారు. మృతదేహాలను వెలికి తీసిన తర్వాత సెల్‌ఫోన్ల కోసం బావి నుంచి నీరంతా తోడినా ఆధారాలు లభించలేదు. మిస్టరీగా మారిన ఈ ఘటనలో సెల్ ఫోన్లే  కీలకంకానున్నాయి. ఆ దిశగా పోలీసుల విచారణ కొనసాగుతోంది. 

Updated Date - 2020-05-23T15:37:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising