ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌కు దడ పుట్టింది: విజయశాంతి

ABN, First Publish Date - 2020-12-16T02:29:48+05:30

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలకు కేసీఆర్‌కు దడ పుట్టిందని, అందుకే ఇప్పుడు ఉద్యోగాల ప్రస్తావన తీశారని ఆమె పేర్కొన్నారు. తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎప్పుడో ఉద్యమకాలంలో ‘మన నీళ్లు, మన ఉద్యోగాలు’ అంటూ పొలికేక పెట్టిన కేసీఆర్‌కు ఇప్పుడు ఉద్యోగాలు గుర్తొచ్చాయని భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి విమర్శించారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు చేసి కేసీఆర్‌కు దడ పుట్టిందని, అందుకే ఇప్పుడు ఉద్యోగాల ప్రస్తావన తీశారని ఆమె పేర్కొన్నారు. తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.


ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే...

‘‘అటు దుబ్బాక, ఇటు జీహెచ్ఎంసీలో బీజేపీ దూకుడు దెబ్బకు కేసీఆర్ దొరగారికి ఒక్కసారిగా నిరుద్యోగులు గుర్తుకొచ్చారు. ఉద్యోగార్థులను ఆరేళ్ళుగా పూచికపుల్లలా తీసిపడేసిన సీఎం గారు ఆదరాబాదరాగా 50 వేల ఉద్యోగాల భర్తీ అంటూ పొలికేక పెట్టారు. మన ఉద్యోగాలు మనకు.. మన నీళ్ళు మనకు అంటూ ఎప్పుడో ఉద్యమకాలంలో నినదించి, అధికారపగ్గాలు అందుకోగానే ఆ విషయం మర్చిపోయారు. బీజేపీ విజయాలు కేసీఆర్ గారికి దడపుట్టించి నిరుద్యోగులు జ్ఞాపకానికి వచ్చారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి రెండేళ్ళుగా జోనల్ సిస్టంను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. టీచర్ల ఏకీకృత సర్వీసు అంశంలో కేంద్రహోంశాఖ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వలేదు. రెండు జిల్లాల నిరుద్యోగులకు అన్యాయం జరిగే పరిస్థితి నెలకొంది. సవరించిన జోన్లకు రాష్ట్రపతి ఆమోదం అవసరం. ఇవిగాక మరెన్నో చిక్కులు దీనితో ముడిపడి ఉన్నాయి. ఇవేమీ తేలకుండా కొత్త పోస్టుల భర్తీ అంత తేలిక కాదు. నిరుద్యోగులను మరోసారి ధోకా చేసే ప్రయత్నాలను రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో సాగవని ఈ మోసాల ముఖ్యమంత్రిగారు గమనించాలి’’ అని తన ఫేస్‌బుక్ ఖాతాలో విజయశాంతి రాసుకొచ్చారు.



Updated Date - 2020-12-16T02:29:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising