ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయశాంతితో మాట్లాడాను: ఉత్తమ్

ABN, First Publish Date - 2020-10-30T22:04:59+05:30

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ హయాంలోనే దుబ్బాక అభివృద్ధి చెందిదని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు దుబ్బాకకు చేసిందేమీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ హయాంలోనే దుబ్బాక అభివృద్ధి చెందిదని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు దుబ్బాకకు చేసిందేమీ లేదన్నారు. హరీశ్‌రావు, రఘునందన్‌రావు అన్నదమ్ముళ్లని, హరీశ్‌రావుకు రఘునందన్ రావు బినామీ అని ఉత్తమ్ ఆరోపించారు. ఆ విషయం తెలియక కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని తప్పుబట్టారు. కాంగ్రెస్ నేత విజయశాంతితో మాట్లాడానని, కరోనా కారణంగానే విజయశాంతి ప్రచారానికి దూరంగా ఉన్నారని తెలిపారు. విజయశాంతికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని మీడియాలో పిచ్చిరాతలు రాస్తోందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.


విజయశాంతి బీజేపీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోన్న వేళ... ఆమెను వెనక్కు పిలిపించుకునేందుకు టీపీసీసీ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ఆమె కాంగ్రెస్ కార్యక్రమాలకు  దూరంగా ఉంటున్నారు. అంతేకాదు ఇటీవల ఆమెతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు ఈ భేటీ జరిగినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశానికి కొద్ది రోజుల కిందట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా విజయశాంతితో భేటీ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విజయశాంతిని బుజ్జగించేందుకు టీపీసీసీ ప్రయత్నిస్తోంది. విజయశాంతి ఇంటికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్ వెళ్లారు. జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి వెళ్లిన కిషన్‌రెడ్డి, మర్యాదపూర్వకంగా కలిశారు. 

Updated Date - 2020-10-30T22:04:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising