ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు విజయదశమి

ABN, First Publish Date - 2020-10-25T07:41:58+05:30

చెడుపై మంచి సాధించిన విజయం రోజున విజయ దశమిని జరుపుకునేందుకు జిల్లా ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ కల్చరల్‌, అక్టోబర్‌ 24: చెడుపై మంచి సాధించిన విజయం రోజున విజయ దశమిని జరుపుకునేందుకు జిల్లా ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు.  శనివారం సాయంత్రం నుంచే జనగామ పట్టణంలో పండుగ సందడి మొదలైంది. వేకువ జామునే లేచి తలంటి స్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరించి  పర్వదినాన్ని జరుపుకునేందుకు పట్టణ, పల్లె ప్రజలు సిద్దమయ్యారు. నూతన వస్త్రాల కొనుగోళ్లతో పాటు దసరా పూజలకు సంబంధించిన సామగ్రిని సిద్ధం చేసుకున్నారు.  ఈ సంవత్సరం మంచి జరగడానికి సూచి కగా ఉదయాన్నే పాలపిట్టను దర్శనం చేసుకునే ందుకు చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రజలు బయల్దేరి వెళతారు. అనంతరం జమ్మి వృక్షం వద్దకు చేరుకొని జమ్మి ఆకుతో ఒకరినొకరు దసరా శుభాకాంక్షలు తెలుపు కుంటారు. కొవిడ్‌ నేపథ్యంలో ఈ సారి శుభాకాంక్షలు పరసర్పర నమస్కారాలకే పరిమితం కానున్నాయి.


అధికారికంగా దసరా ఏర్పాట్లు చేయకూడదని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. విందూ వినోదాలకు ప్రతీకగా నిలిచిన దసరా సందర్భంగా జిల్లా కేంద్రం లోని వైన్స్‌లు, బార్లు వినియోగదారులతో కిటకిట లాడాయి. బార్లముందు జనం బారులుదీరారు. కొవిడ్‌ సందర్భంగా ప్రభుత్వం సైతం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. విజయదశమి పర్వదినం సందర్భంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్‌ కె.నిఖిల, మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ పి.జమున, జడ్పీ చైర్మెన్‌ పాగాల సంపత్‌రెడ్డి, ఎంపీపీ మేకల కళింగరాజు తదిత రులు ప్రజలు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.  కాగా దసరా ఉత్సవాల్లో కరోనా నిబంఽధనలు పాటిస్తూ తక్కువ మందితో జరుపుకునేందుకు అధికారులు, పోలీసులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-10-25T07:41:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising