ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చినజీయర్‌స్వామికి వెంకయ్య పరామర్శ

ABN, First Publish Date - 2020-09-14T09:26:45+05:30

చినజీయర్‌స్వామికి వెంకయ్య పరామర్శ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక వేత్త త్రిదండి చినజీయర్‌ స్వామికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్‌ చేసి పరామర్శించారు. చినజీయర్‌ స్వామి తల్లి అలివేలు మంగతాయారు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం చినజీయర్‌ స్వామితో వెంకయ్య మాట్లాడారు. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. చినజీయర్‌ స్వామిలో ధార్మిక, సామాజిక దృష్టి కలగడానికి ఆయన మాతృమూర్తి కీలక పాత్ర పోషించారన్నారు. సంప్రదాయ మధ్యతరగతి గృహిణిగా పిల్లల జీవితాలను చక్కగా తీర్చిదిద్దిన తీరు అందరికీ ఆదర్శప్రాయమన్నారు. కాగా చినజీయర్‌ను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శనివారం పరామర్శించారు.  

Updated Date - 2020-09-14T09:26:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising