ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్ధిక సాధికారతతోనే మహిళలకు సమానత్వం- ఉపరాష్ట్రపతి

ABN, First Publish Date - 2020-03-09T00:41:33+05:30

విద్చా, ఆర్ధికంగా మహిళలకు సాఽధికారత కల్పించినప్పుడే వారికి సమాజంలో సమానత్వం లభిస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: విద్చా, ఆర్ధికంగా మహిళలకు సాఽధికారత కల్పించినప్పుడే వారికి సమాజంలో సమానత్వం లభిస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు పేర్కొన్నారు. రాజకీయంగా, సామాజికంగా మహిళలను ముందుకు తీసుకెళ్లేందుకు మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో రెండు వేర్వేరు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఉదయం దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ ఆంద్ర మహిళా సభ ఆధ్వర్యంలో ఓబుల్‌రెడ్డిపబ్లిక్‌స్కూల్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళ ముఖంలో చిరునవ్వు చూడగలిగినప్పుడే మనం అభివృద్ధి చెందినట్టుగా ఆయన పేర్కొన్నారు. పనికేంద్రాల్లో మహిళలు క్రియాశీలకంగా ఉన్పప్పుడు ఆర్ధిక వ్యవస్ధ పరుగులు పెడుతుంది. మన దేశంలో చాలా చోట్ల ఆడవారిని వంటింటి కుందేళ్ల మాదిరిగా చూసే పరిస్థితి వుంది. ఇది వారికి ఆర్ధిక అవకాశాల పరిధిని పరిమితం చేసింది. ఈ విధానంలో మార్పుతీసుకు వచ్చి వారికి విద్య, ఉద్యోగంతోపాటు ఆర్ధికపరమైన అంశాల్లో సమానత్వం కల్పించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. 


స్ర్తీకి విద్య, ఆర్ధిక అధికారం దక్కినప్పుడే సమానత్వం, సాధికారతకు బాటలు పడతాయన్నారు. ప్రభుత్వాలతో పాటు కార్పొరేట్‌ సంస్థలు,  స్వచ్చంద సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలతో సమాజంలో సమాజంలో ఈ దిశగా మార్పు తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలన్నారు. మహిళా సాధికారతను అనేక కోణాల్లో ఆలోచించి అర్ధం చేసుకోవల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. దీని కోసం ముందు సమాజం ఆలోచన ధోరణిలోమార్పు రావాలన్నారు. ప్రజా స్వామ్యంలో అన్ని వర్గాలకు సాధికారత చాలా అవసరం. దేశ జనాభాలో 50శాతానికి పైగా ఉన్న మహిళలకు సరైన అవకాశాలు కల్పించి వారి శక్తిని దేశాభివృద్ధికి వినియోగించుకోవాలన్నారు. ఈ దిశగా ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలతో పాటు కార్పొరేట్‌, స్వచ్చంద సంస్థలు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. 

Updated Date - 2020-03-09T00:41:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising