ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాకవి శ్రీశ్రీ మెచ్చుకున్న ప్రజాకవి వంగపండు : ఆర్.నారాయణమూర్తి

ABN, First Publish Date - 2020-08-04T23:53:37+05:30

జానపద వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మరణం తీరని లోటని పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి అన్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జానపద వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మరణం తీరని లోటని పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి అన్నారు. వంగపండు మరణించిన సందర్భంగా ఆయన స్మృతులను ఆర్.నారాయణమూర్తి గుర్తు చేసుకున్నారు. ‘అర్ధరాత్రి స్వతంత్రం’ సినిమా సందర్భంగా వంగపండును కలిశానన్నారు. ఆ సినిమాకు పాటలు రాయాలని అడిగానని చెప్పారు. కథ నచ్చితేనే పాటలు రాస్తానని వంగపండు తనతో అన్నారని నారాయణ మూర్తి తెలిపారు. ‘‘కథ చెప్పాను. పాటలు రాశారు. సినిమా విడుదలైంది. ‘అర్ధరాత్రి స్వతంత్రం’ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. అలా వంగపండుతో పరిచయం అయింది. అక్కడి నుంచి చాలా సినిమాల్లో మా పయనం కొనసాగింది. వంగపండు... ఉత్తారాంధ్ర ధార. ‘‘వంగపండు.. పాటలు రాస్తారు.. పాడతాడు.. ఆడతాడు... అలా ప్రముఖ వాగ్గేయకారుడు అయ్యారు. నేను బీఏ చదివే రోజుల్లో వంగపండు గురించి తెలుసుకున్నా. అప్పటికే ఆయన ప్రముఖ విప్లవకవి, ప్రముఖ ప్రజాకవి. ప్రజా ఉద్యమాల్లో గజ్జె కట్టి ఆడుతూ బీభత్సం చేస్తున్నాడు. ‘ఉత్తరాంధ్ర సంతకం’ వంగపండు ప్రసాదరావు అని అప్పటికే గొల్లపూడి మారుతీరావు అన్నారు. 1969లో శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. పార్వతీపురంలో లక్షలాది మంది ప్రజల సమక్షంలో సభ జరుగుతోంది. వంగపండు పాట విని మహాకవి శ్రీశ్రీ మైమర్చిపోయి నిజమైన ప్రజాకవిని నేను కాదు. వంగపండు ప్రసాదరావు, గద్దర్ అని ఖితాబు ఇచ్చారు.’’ అని నారాయణ మూర్తి తెలిపారు. 

Updated Date - 2020-08-04T23:53:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising