వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం
ABN, First Publish Date - 2020-08-11T03:25:07+05:30
హైదరాబాద్: వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ వరకూ వీర భారత పుత్రుల విజయగాథలపై వక్తల వెబ్ ప్రసంగాలు ఏర్పాటు చేసింది. ప్రతిరోజూ సాయంత్రం ఐదు నుంచి ఆరు వరకూ దేశ భక్తుల గురించి వక్తలు ప్రసంగిస్తారు.
హైదరాబాద్: వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ వరకూ వీర భారత పుత్రుల విజయగాథలపై వక్తల వెబ్ ప్రసంగాలు ఏర్పాటు చేసింది. ప్రతిరోజూ సాయంత్రం ఐదు నుంచి ఆరు వరకూ దేశ భక్తుల గురించి వక్తలు ప్రసంగిస్తారు. గూగుల్ మీట్ ద్వారా ఆన్‌లైన్ ప్రసంగాలుంటాయి. వక్తల్లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, సామాజిక కార్యకర్తలు ఎక్కా చంద్రశేఖర్, అప్పాల ప్రసాద్, రామకృష్ణ మఠం నుంచి స్వామి శితికంఠానంద తదితరులు ప్రసంగిస్తారు. ఆగస్ట్ ఒకటిన ప్రారంభమైన ఈ కార్యక్రమం స్వాతంత్ర్యదినోత్సవం ఆగస్ట్ 15వరకూ కొనసాగనుందని వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవీంద్ర తెలిపారు.
Updated Date - 2020-08-11T03:25:07+05:30 IST