ఎస్టీల్లో చేర్చాలి.. ఎర్రబెల్లికి వడ్డెర్ల విజ్ఞప్తి
ABN, First Publish Date - 2020-12-29T08:44:33+05:30
తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని వడ్డెర కులస్తులు సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కోరారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి సంఘం నేతలు సోమవారం మంత్రిని కలిశారు
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని వడ్డెర కులస్తులు సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కోరారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి సంఘం నేతలు సోమవారం మంత్రిని కలిశారు. వడ్డెరలు చాలా వెనుకబడి ఉన్నారని, అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ మీర్‌పేట డివిజన్‌లోని నరసింహనగర్, డైమండ్ కాలనీల్లోని భూములను రైల్వే జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్‌కు మార్పించాలని కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ ప్రభుదాస్, టీఆర్‌ఎస్ నేత శ్రీనివాసరెడ్డి తదితరులు మంత్రి ఎర్రబెల్లిని కోరారు.
Updated Date - 2020-12-29T08:44:33+05:30 IST