ఉత్తమ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు: కర్నె ప్రభాకర్
ABN, First Publish Date - 2020-06-02T01:13:54+05:30
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తప్పుబట్టారు. ఉత్తమ్‌కు ఇంటి పోరు ఎక్కువై అలా మాట్లాడుతున్నారని
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తప్పుబట్టారు. ఉత్తమ్‌కు ఇంటి పోరు ఎక్కువై అలా మాట్లాడుతున్నారని, ఉత్తమ్ తీరు కాంగ్రెస్ కార్యకర్తలకే నచ్చడం లేదని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లు ఎక్కడ ఆగాయో కాంగ్రెస్ నేతలు నిరూపించాలన్నారు. కాంగ్రెస్ నేత రేవంత్ అమరుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు.
Updated Date - 2020-06-02T01:13:54+05:30 IST