ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సివిల్ సర్వీస్ పరీక్షలో సత్తా చాటిన 30 మంది తెలుగు విద్యార్థులు

ABN, First Publish Date - 2020-08-05T03:55:52+05:30

సివిల్ సర్వీస్ పరీక్ష-2019 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. యూపీఎస్సీ విడుదల చేసిన ఈ పరీక్షా ఫలితాల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సివిల్ సర్వీస్ పరీక్ష-2019 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. యూపీఎస్సీ విడుదల చేసిన ఈ పరీక్షా ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దాదాపు 30 మంది తెలుగు విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. హైదరాబాద్‌కు చెందిన తెలుగు యువతి పెద్దిటి ధాత్రి రెడ్డి 46వ ర్యాంకు సాధించింది. రెండో ప్రయత్నంలో ఐపీఎస్‌‌కు అర్హత సాధించిన ధాత్రిరెడ్డి హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. మూడో ప్రయత్నంలో ఐఏఎస్‌కు అర్హత సాధించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి డిగ్రీ పొందిన ఆమె గతంలో ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా కూడా పనిచేశారు.

సివిల్ సర్వీస్ పరీక్ష-2019 ఫలితాల కోసం క్లిక్ చేయండి

ఇక.. మల్లవరపు సూర్యతేజకు 76వ ర్యాంకు, కట్టా రవితేజ 77వ ర్యాంకు, ఎంవీ సత్యసాయి కార్తీక్ 103, తాటిమాకుల రాహుల్ రెడ్డి 117, కె.ప్రేమ్‌సాగర్ 170, శ్రీచైతన్య కుమార్ రెడ్డి 250, చీమల శివగోపాల్ రెడ్డి 263, బి.రాహుల్ 272, మోహన్ కృష్ణ 283, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి 314, ముత్తినేని సాయితేజ 344, ముక్కెర లక్ష్మీ పావన గాయత్రి 427, కొల్లాబత్తుల కార్తీక్ 428, ఎన్ వివేక్ రెడ్డి 485, కొరుపోలు సత్యధర్మ ప్రతాప్ 510, నీతిపూడి రష్మితా రావు 534, కోరుకొండ సిద్ధార్థ 566, సమీర్ రాజా 603, కొప్పిశెట్టి కిరణ్మయి 633వ ర్యాంకు సాధించి తెలుగు రాష్ట్రాల నుంచి సత్తా చాటారు.

Updated Date - 2020-08-05T03:55:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising