ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కులాలవారీ జనాభా గణనకు కేంద్రం సుముఖత

ABN, First Publish Date - 2020-10-04T07:30:11+05:30

దేశ జనాభా గణనలో కులాలవారీ లెక్కలు తీసేందుకు తమ ప్రభుత్వం సుముఖంగా ఉందని జాతీయ బీసీ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 


హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): దేశ జనాభా గణనలో కులాలవారీ లెక్కలు తీసేందుకు తమ ప్రభుత్వం సుముఖంగా ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులతోనూ చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఓ ప్రకటనలో వెల్లడించారు. దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో కిషన్‌రెడ్డిని శనివారం కృష్ణయ్య కలిశారు. దేశ జనాభా గణనలో కులాల వారీ లెక్కలు తీయాలని మంత్రిని కోరారు. బీసీ కులాల జనాభా లెక్కలు లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. 2018లో అక్టోబరు 1న జరిగిన కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి సమావేశంలో జనాభా గణన బీసీ కులాల వారిగా సేకరించాలని నిర్ణయం తీసుకొని, రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎందుకు వెనక్కు తగ్గారని ప్రశ్నించారు.

Updated Date - 2020-10-04T07:30:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising