ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులకు కిషన్‌రెడ్డి పరామర్శ

ABN, First Publish Date - 2020-12-12T02:33:09+05:30

నకిరేకల్‌లో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: నకిరేకల్‌లో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు. నకిరేకల్‌లోని నోముల నివాసంలో ఆయన చిత్ర పటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను కిషన్ రెడ్డి ఓదార్చారు. అంతకముందు తిరుమలగిరి, అర్వపల్లిలో సాయిబాబా దేవాలయంలో కిషన్‌రెడ్డి పూజలు నిర్వహించారు.


పరామర్శ అనంతరం కిషన్‌రెడ్డి ఏమన్నారంటే..
‘ప్రజా సమస్యలపై నిలదీసే మంచి స్వభావం ఉన్న వ్యక్తి నోముల నర్సింహయ్య. క్వార్టర్స్ లో ఎదురెదురు నివాసంలో ఉండేవాళ్లం. పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా అసెంబ్లీలో  ప్రజా సమస్యలపై పోరాడే వాళ్లం. 2004 నుంచి అయనతో ఏర్పడిన స్నేహం ఆయన చనిపోయే 4 గంటల ముందు కూడా నాతో మాట్లాడారు. ఎవరికీ భయపడకుండా బడుగు బలహీన వర్గాలు కోసం ఆయన పనిచేశారు. తెలుగు ప్రజలు, చేతి వృత్తుల పనివారు వారిని మరచిపోలేరు. మరి కొంత కాలం ఆయన జీవించి ఉంటే పేద ప్రజలకు మరింత మేలు జరిగేది’ అని కిషన్‌రెడ్డి గత స్మృతులను జ్ఞాపకం చేశారు.

Updated Date - 2020-12-12T02:33:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising