ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు నెలల చిన్నారి కిడ్నాప్‌

ABN, First Publish Date - 2020-11-13T09:17:13+05:30

రెండు నెలల చిన్నారి కిడ్నా్‌పకు గురైంది. 9గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

9గంటలల్లో కేసు ఛేదించిన పోలీసులు 

హైదరాబాద్‌ సిటీ/చార్మినార్‌, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): రెండు నెలల చిన్నారి కిడ్నా్‌పకు గురైంది. 9గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు.. బిడ్డను తల్లి చెంతకు చేర్చారు. షేక్‌ బషీర్‌, భార్య సుల్తానా, ఇద్దరు పిల్లలు.. ఫరూక్‌నగర్‌లోని ఒక ఫుట్‌పాత్‌పై నివాసం ఉంటున్నారు. రాత్రి అక్కడే పడుకున్న వారు.. తమ బిడ్డ లేకపోవడాన్ని తెల్లవారుజామున గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అర్ధరాత్రి సమయంలో ఓ ఆటోలో వచ్చిన కొంతమంది ఆ బిడ్డను తీసుకుని వెళ్లినట్లు పోలీసులు గుర్తించి.. తక్షణమే రంగంలోకి దిగారు. ఈ క్రమంలో.. సలామి ఆస్పత్రి పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక ఆటోను ఆపి విచారించారు.

వట్టేపల్లి ప్రాంతానికి చెందిన సయ్యద్‌ సాహిల్‌, అతని భార్య జబీన్‌ ఫాతిమా, ఆమె సోదరి ఫాతిమాను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్‌ చేసింది వారేనని నిర్ధారించుకున్నారు. వారి వద్ద నుంచి బిడ్డను తీసుకుని తల్లికి అప్పగించారు.


Updated Date - 2020-11-13T09:17:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising