ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శారదాపీఠం చొరవకు అభినందనలు: విజయశాంతి

ABN, First Publish Date - 2020-05-26T02:46:07+05:30

తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నిర్ణయాలు వివాదాలకు అతీతంగా ఉండాల్సిన అవసరం ఉందని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నిర్ణయాలు వివాదాలకు అతీతంగా ఉండాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి అన్నారు. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆమె స్పందించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి... టీటీడీ బోర్డు ఒకటికి వందసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందన్నారు. లేనిపక్షంలో వివాదాలకు కేంద్రబిందువు అయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. టీటీడీ భూముల వివాదాన్ని పరిష్కరించే దిశగా విశాఖ శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామి తీసుకున్న చొరవను విజయశాంతి అభినందించారు. టీటీడీ బోర్డు నిర్ణయాలపై ఆధ్యాత్మికవేత్తల సూచనలు, సలహాలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు తలెత్తే అవకాశం ఉండదని ఆమె చెప్పారు. 



Updated Date - 2020-05-26T02:46:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising