ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఎస్‌ ఐసెట్‌ ఫలితాలు విడుదల

ABN, First Publish Date - 2020-11-03T07:51:04+05:30

ఎంబీఏ, ఎంసీఏ కళాశాల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎ్‌సఐసెట్‌-2020.. ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం వరంగల్‌లోని కాకతీయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 41,506 మంది అర్హత

హైదరాబాద్‌కు చెందిన శుభశ్రీకి ఫస్ట్‌ ర్యాంకు

టాప్‌ 10లో ఇద్దరు ఏపీ విద్యార్థులు

హైదరాబాద్‌/కేయూ క్యాంపస్‌, నవంబరు 2: ఎంబీఏ, ఎంసీఏ కళాశాల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎ్‌సఐసెట్‌-2020.. ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కె.రాజిరెడ్డితో కలిసి రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ టి.పాపిరెడ్డి ఫలితాలను ప్రకటించారు. టాప్‌ టెన్‌ ర్యాంకుల్లో తొలి ర్యాంకును హైదరాబాద్‌కు చెందిన శుభశ్రీ సాధించగా, 8, 9 ర్యాంకులు ఏపీ విద్యార్థులకు లభించాయి. 


ఐసెట్‌లో మొత్తం 90.28 శాతం ఉత్తీర్ణత సాధించారని పాపిరెడ్డి చెప్పారు.  58,392 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. 45,975మంది పరీక్ష రాసినట్టు చెప్పారు. వీరిలో 41,506 మంది విద్యార్థులు అర్హత సాధించారని వివరించారు.  వీరిలో 41,506 మంది విద్యార్థులు అర్హత సాధించారని వివరించారు.  కాగా, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని చైర్మన్‌ పాపిరెడ్డి, కన్వీనర్‌ రాజిరెడ్డి తెలిపారు. 


టాప్‌ 10 ర్యాంకర్ల వివరాలు


విద్యార్థి పేరు ర్యాంకు మార్కులు

బి.శుభశ్రీ (హైదరాబాద్‌) 1 159

జి.సందీప్‌ (ఆర్మూర్‌)   2 144

అవినాశ్‌ సిన్హా(హైదరాబాద్‌) 3 142

ఎ.ప్రసన్న లక్ష్మి (వరంగల్‌) 4 142

శ్రీకృష్ణసాయి (రంగారెడ్డి) 5 141

టి.అఖిల్‌ రెడ్డి (రంగారెడ్డి) 6 140

జాయ్‌దీప్‌ డే (బెంగాల్‌) 7 140

పి.అఖిల్‌ రెడ్డి (ఏపీ) 8 139

రాజశేఖర్‌రెడ్డి (ఏపీ) 9 136

సోహెల్‌ (భద్రాది) 10 135


Updated Date - 2020-11-03T07:51:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising