ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కబ్జాలకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

ABN, First Publish Date - 2020-12-11T04:49:04+05:30

అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడుతూ, వారి అవినీతి, అక్రమాల గుట్టురట్టు చేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మండిపడ్డారు.

కొత్తగట్టులో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కబ్జాలకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు 

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి

ఆత్మకూరు, డిసెంబరు 10: అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడుతూ, వారి అవినీతి, అక్రమాల గుట్టురట్టు చేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం కొత్తగట్టులో బీజేపీలోకి భారీ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జర్నలిస్టులను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. డబుల్‌ బెడ్‌రూంలు, దళితులకు మూడు ఎకరాలు, నిరుద్యోగ భ్రుతి, రైతులకు మద్దతు ధర కల్పించడంతో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడుకొండేటి శ్రీధర్‌,  పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టరు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు సదానందం తదితరులు పాల్గొన్నారు.

ఫ అక్కంపేటలో జరిగిన మరో కార్యక్రమంలో పలువురు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌ సమక్షంలో గురువారం బీజేపీలో చేరారు. కొండేటి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ నేతల మాయమాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్‌గౌడ్‌, పరకాల కార్పొరేటర్‌ జయంతిలాల్‌, జిల్లా ప్రొటోకాల్‌ కన్వీనర్‌ ఎదులాపురం శ్రవణ్‌కుమార్‌, పార్టీ మండల అధ్యక్షుడు నదానందం తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2020-12-11T04:49:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising