ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ అరవింద్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సవాల్

ABN, First Publish Date - 2020-07-13T16:00:06+05:30

బీజేపీ ఎంపీ అరవింద్.. టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు, తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ : జిల్లా పర్యటనలో భాగంగా బీజేపీ ఎంపీ అరవింద్.. టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు, తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలి లేకుంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. నిన్నట్నుంచి టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవాళ కూడా హన్మకొండలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు, నేతలు పోటాపోటీగా నిరసనలకు దిగారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. నిన్నట్నుంచి ఈ ఉద్రిక్తత కొనసాగుతున్నది. ఇదిలా ఉంటే.. ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఇంటి వద్ద పోలీస్ పహారా కాస్తున్నారు. మరోవైపు బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇలా ఆదివారం నుంచి బీజేపీ ఎంపీ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి.


నిరూపిస్తే రాజీనామా..

ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలపై సుబేధారి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. బీజేపీ అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఎంపీ అరవింద్ కారును అడ్డుకున్న ఐదుగురు టీఆర్ఎస్వీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. పోటాపోటీగా బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీంతో సుబేదారి పీఎస్‌లో మరో కేసు నమోదయ్యింది. తనపై అరవింద్ చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని నన్నపునేని నరేందర్ సవాల్ విసిరారు. నిరూపించలేని పక్షంలో అరవింద్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2020-07-13T16:00:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising