ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెపరెపలాడిన టీఆర్‌ఎస్‌ జెండా.. ఇక్కడ క్లీన్‌ స్వీప్‌

ABN, First Publish Date - 2020-12-05T11:59:58+05:30

గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలోని 3 డివిజన్‌లలో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయఢంకా మోగించింది. శుక్రవారం లయోలా కళాశాలలో డీఆర్‌సీ కేంద్రంలో డివిజన్‌ల వారీగా ఓట్లను లెక్కించారు. అల్వాల్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింతల విజయశాంతి శ్రీనివా్‌సరెడ్డి రెండోసారి తన సమీప బీజేపీ అభ్యర్థి వీణాగౌడ్‌ పై 2057 ఓట్లతో విజయం సాధించారు. వెంకటాపురం డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సబితకిషోర్‌ తన సమీప బీజేపీ అభ్యర్థి శివ అభిషేక్‌పై 1165 ఓట్లతో విజయం సాధించారు. మచ్చబొల్లారం డివిజన్‌ నుంచి వరసగా మూడవసారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజ్‌జితేందర్‌నాధ్‌ విజయం సాధించి హ్యాట్రిక్‌ సాధించారు. ఈ మూడు డివిజన్‌లలోనూ బీజేపీ అభ్యర్థులు అధికార పార్టీకి గట్టి పోటీ నిచ్చారు.


ప్రజాసంక్షేమ పథకాలే విజయానికి కారణం

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నిర్వహిస్తున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలే తన విజయానికి కారణమన్నారు. తాగునీరు, హెయిర్‌ సెలూన్‌లకు ఉచిత కరెంట్‌ వంటి అంశాలు కూడా విజయానికి కారణమయ్యాయన్నారు. - అల్వాల్‌ కార్పొరేటర్‌ శాంతిశ్రీనివాస్‌రెడ్డి


హ్యాట్రిక్‌ విజయం ప్రజలకు అంకితం

ప్రజల అభిమానం సీఎం కేసీఆర్‌ ప్రజా సంక్షేమ కార్యక్రమాలే తన విజయానికి కారణమయ్యాయి. దానికి తోడు నిత్యం ప్రజల అభివృద్ధి కోసం పరితపించే ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కృషి కారణంగా విజయం సాధించాను. - రాజ్‌ జితేందర్‌నాధ్‌, మచ్చబొల్లారం డివిజన్‌ 


ఇది ప్రజా విజయం

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పేదబహీన వర్గాల ప్రజలకు కోసం సీఎం విజయవంతగా నిర్వహిస్తున్న పథకాలే నా విజయానికి దోహదపడ్డాయి. - సబితాకిషోర్‌ వెంకటాపురం డివిజన్‌ 

Updated Date - 2020-12-05T11:59:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising