మంత్రి ఎర్రబెల్లికి సన్మానం
ABN, First Publish Date - 2020-10-03T11:02:39+05:30
కేంద్రప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛభారత్ మిషన్ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ స్థానం, కరీంనగర్ జిల్లాకు తృతీయ స్థానం..
హన్మకొండ టౌన్, అక్టోబరు 2: కేంద్రప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛభారత్ మిషన్ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ స్థానం, కరీంనగర్ జిల్లాకు తృతీయ స్థానం రావడానికి కృషి చేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును హన్మకొండలో శుక్రవారం ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సన్మానించారు. వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి ఎర్రబెల్లి పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖలను అభివృద్ధి పథంలో నడిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు ఇండ్ల నాగేశ్వర్‌రావు ఉన్నారు.
Updated Date - 2020-10-03T11:02:39+05:30 IST