ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రవాణా శాఖ కమిషనరేట్‌ ముట్టడి

ABN, First Publish Date - 2020-10-01T07:17:10+05:30

మ్యాక్సీ క్యాబ్స్‌, మినీ బస్సులను నడిపే ట్రావెల్‌ ఆపరేటర్లు బుధవారం ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనరేట్‌ను ముట్టడించారు. త్రైమాసిక మోటారు వాహన పన్ను....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్రైమాసిక వాహన పన్ను మాఫీ చేయాలని డిమాండ్‌


హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మ్యాక్సీ క్యాబ్స్‌, మినీ బస్సులను నడిపే ట్రావెల్‌ ఆపరేటర్లు బుధవారం ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనరేట్‌ను ముట్టడించారు. త్రైమాసిక మోటారు వాహన పన్నును మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌, ఇతర జిల్లాల నుంచి తరలి వచ్చిన ఆపరేటర్లు కమిషనరేట్‌ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడానికి బయలుదేరిన ఆపరేటర్లను పోలీసులు అరెస్టు చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా వాహనాలు నడవక రోడ్డున పడిన తమ నుంచి ప్రభుత్వం త్రైమాసిక మోటారు వాహన పన్నును ముక్కు పిండి వసూలు చేస్తుందని తెలంగాణ స్టేట్‌ క్యాబ్స్‌, బస్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సయ్యద్‌ నిజాముద్దీన్‌ ఆరోపించారు. సెప్టెంబరు 5న తాము ధర్నా చేయడంతో పన్ను మాఫీ ప్రతిపాదనను ప్రభుత్వ పరిశీలనకు పంపుతామని అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. పన్ను మాఫీ ఉత్తర్వులు వెలువడలేదని, పైగా వాహనాలకు పెద్ద మొత్తంలో పెనాల్టీ విధిస్తున్నారని తెలిపారు. 

Updated Date - 2020-10-01T07:17:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising