యువతకు శిక్షణ, ఉపాధి: ఏటీడీసీ
ABN, First Publish Date - 2020-12-15T09:07:40+05:30
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన(డీడీయూజీకేవై) కింద యువతకు శిక్షణ
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన(డీడీయూజీకేవై) కింద యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అప్పెరల్ ట్రైనింగ్ అండ్ డిజైన్ సెంటర్(ఏటీడీసీ) ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపింది. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు హైదరాబాద్‌లోని కేంద్రంలో పారిశ్రామిక ఎగ్జిక్యూటివ్ కోర్సుపై ఆరు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొంది.
డిసెంబరు 1 నుంచి కొత్త బ్రాచ్ ప్రారంభమైనదని, శిక్షణ అనంతరం వారికి వస్త్ర పరిశ్రమలలో ఉపాధి కల్పిస్తామని ఏటీడీసీ పేరొన్నది. వివరాల కోసం ఏటీడీసీ, సర్వే నెం: 64, నెక్ట్స్ గలేరియా మాల్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర, మదాపూర్, హైటెక్ సిటీ, హైదరాబాద్-81 చిరునామాలో సంప్రదించాలని లేదా సెల్ నెంబర్లు: 9611238944, 9177041704 లలో సంప్రదించాలని సూచించింది.
Updated Date - 2020-12-15T09:07:40+05:30 IST