ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాండూరు-హైదరాబాద్ మధ్య స్తంభించిన రాకపోకలు

ABN, First Publish Date - 2020-07-31T16:41:02+05:30

తాండూరు-హైదరాబాద్ ప్రధాన రోడ్డులో రాకపోకలు స్తంభించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్ జిల్లా: తాండూరు-హైదరాబాద్ ప్రధాన రోడ్డులో రాకపోకలు స్తంభించాయి. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మన్సాన్పల్లి సమీపంలోని వాగుపై కొత్తగా వంతెన నిర్మిస్తుండటంతో పాత వంతెనను తొలగించి పక్క నుండి వేసిన  ప్రత్యామ్నాయ రోడ్డు తెగిపోయింది. అది తాండూరు హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంతెన తెగిన విషయం తెలియక చాలామంది మన్సాన్పల్లి వరకు వచ్చి తిరిగి వెళ్లిపోతున్నారు. ఇక్కడి నుండి తిరిగి అవతల వైపు వెళ్లడానికి సుమారు ఇరవై కిలోమీటర్లు అదనంగా తిరగాల్సి వస్తోంది. 


మన్సాన్పల్లి వంతెన నిర్మాణానికి సుమారు మూడేళ్ల క్రితమే టెండర్లు ఖరారైనా అధికారులు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహించి వర్షాకాలం ఆరంభానికి ముందర వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. పాత వంతెన పూర్తిగా తొలగించి కొత్త వంతెన నిర్మాణం కోసం పక్క నుండి ప్రత్యామ్నయ రోడ్డు వేశారు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రత్యామ్నాయ రోడ్డు తెగిపోవడంతో తాండూరు హైదరాబాద్ మధ్యన రాకపోకలు స్తంభించాయి. తాండూరు హైదరాబాద్ రాకపోకలు జరిపేందుకు సుమారు ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల వరకు అదనపు ప్రయాణం చేయాల్సి వస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-07-31T16:41:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising