ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణాలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నాం- మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ABN, First Publish Date - 2020-02-23T02:08:26+05:30

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు తెలంగాణలో పర్యాటక రంగాన్ని ఎంతో అభివృద్దిచేస్తున్నామని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు తెలంగాణలో పర్యాటక రంగాన్ని ఎంతో అభివృద్దిచేస్తున్నామని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌అన్నారు. రాష్ట్రంలో ఎంతో ప్రాచీన  చరిత్ర, వారసత్వ సంపద పరిరక్షణ, ఎకో టూరిజం, టెంపుల్‌టూరిజం, మెడికల్‌టూరిజం కు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు అభివృద్ధికి ప్రణాళికలను అమలుచేస్తున్నామని అన్నారు. కేరళలో పర్యటిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఈసందర్భంగా కేరళ పర్యాటకశాఖ మంత్రి సురేంద్రన్‌, సాంస్కృతికశాఖ మంత్రి ఎకెబాలన్‌తో సమావేశమయ్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో ప్రకృతి విలయతాండవం వల్లసంభవించిన వరదలతో పర్యాటక ప్రదేశాలకు ఎంతో నష్టం కలిగిందన్నారు. నష్టం సంభవించిన పర్యాటక ప్రదేశాలను యుద్ధ ప్రాతిపదికన మళ్లీ యథాస్ధితికి తీసుకు వచ్చిన కేరళ ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయమని అన్నారు. సీఎం కేసీఆర్‌ గతంలో కేరళలో పర్యటించినప్పుడు కేరళ టూరిజం ,తెలంగాణ టూరిజం శాఖలు సంయుక్తగా కలిసి పని చేయాలని కోరారన్నారు. ఇరు రాష్ర్టాల మధ్యపర్యాటక రంగ అభివృద్ధికి సహకరించుకుందామని అన్నారు. దీనికి కేరళ టూరిజంశాఖ మంత్రి సురేంద్రన్‌ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ఒక అవగాహనా ఒప్పందం ఎంవోయూ కుదుర్చుకోవడానికి ఇరు రాష్ర్టాల మంత్రులు అంగీకరించారు. 

Updated Date - 2020-02-23T02:08:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising