ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్‌కు భారీగా టమాటా దిగుమతులు

ABN, First Publish Date - 2020-12-04T21:02:44+05:30

గత కొన్ని రోజులుగా సామాన్య ప్రజలకు దడపుట్టించిన టమాటా ధరలు దిగి వస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: గత కొన్ని రోజులుగా సామాన్య ప్రజలకు దడపుట్టించిన టమాటా ధరలు దిగి వస్తున్నాయి. జంటనగరాల్లోని ప్రధాన హోల్‌సేల్‌ మార్కెట్‌లకు భారీగా టమాటా దిగుమతి అవుతోంది. హైదరాబాద్‌ మార్కెట్‌కు తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక నుంచి కూడా టమాటా దిగుమతి అవుతోంది. గత నెల రోజుల క్రితం కిలో టమాటా 50 నుంచి 60 రూపాయలు పలికింది. మార్కెట్‌కు దిగుమతు తగ్గడం వల్లనే ధరలు పెరిగినట్టు వ్యాపారులు తెలిపారు. అంతే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాల వల్ల కూడా టమాటా పంట దెబ్బతినడంతో వల్ల దిగుమతులు బాగా తగ్గిపోయాయి. కానీ ప్రస్తుతం మార్కెట్‌కు భారీగా టమాటా దిగుమతి పెరిగింది. 


రోజుకు 80 నుంచి 100 లారీల టమాట హైదరాబాద్‌కు దిగుమతి అవుతున్నట్టు వ్యాపారులు తెలిపారు. దీంతో ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్‌లలో కిలో టమాటా 15 నుంచి 25 రూపాయల మధ్య అమ్ముతున్నారు. దీంతో సామాన్య ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించే ప్రతిసారీ నిత్యావసర వస్తువులపై ప్రభావం చూపిస్తుంది. ప్రత్యేకించి సామాన్య ప్రజలు నిత్యం వాడే టమాటా ధర పెరిగిన ప్రతిసారీ దాని ప్రభావం ఇతర వస్తువులపై కూడా చూపిస్తోంది. 


Updated Date - 2020-12-04T21:02:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising