ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు, రేపు వర్ష సూచన

ABN, First Publish Date - 2020-09-14T09:41:25+05:30

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దగ్గరలో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దానికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పియర్‌ ఎత్తు వరకు ఉపరితల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13(ఆంధ్రజ్యోతి): పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దగ్గరలో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దానికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పియర్‌ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఆదివారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల భారీ, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిశాయి. సోమ, మంగళవారాలు కూడా ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాలు పడుతుండటంతో గాలిలో తేమ శాతం మళ్లీ పెరిగింది. కాగా, పత్తి రైతులు మాత్రం అధిక వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం సాయంత్రానికి సత్తుపల్లిలో అత్యధికంగా 83.5 మి.మీ, భద్రాద్రి కొత్తగూడెంలో 73.5 మి.మీ వర్షపాతం నమోదైంది.

Updated Date - 2020-09-14T09:41:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising