ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొంతెమ్మ కోర్కెలు కోరం: టీఎన్జీవో నేత రాజేందర్‌

ABN, First Publish Date - 2020-12-30T20:53:33+05:30

ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చినంత పీఆర్సీని తమకు కూడా ఇవ్వాలని టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు రాజేందర్‌ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చినంత పీఆర్సీని తమకు కూడా ఇవ్వాలని టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు రాజేందర్‌ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా గొంతెమ్మ కోర్కెలు కోరమని, పెరిగిన ధరలను దృష్డిలో ఉంచుకునే సీఎం కేసీఆర్ పీఆర్సీ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిట్మెంట్ ఎంత కావాలో సీఎంతో చెబుతామని తెలిపారు. ఉద్యోగ సంఘంపై బీజేపీ నేతల మాటల్ని పట్టించుకోమని రాజేందర్‌ పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వేసిన తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదిక వారంలోగా ప్రభుత్వానికి చేరనుంది. ఈ నివేదిక ప్రధానంగా రెండు లేదా మూడంచెల ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వానికి సంకేతాలు చేరినట్లు సమాచారం. ఉద్యోగ సంఘాల అంచనాల ప్రకారం.. కమిషన్‌ రెండు రోజుల్లోగా నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలున్నాయి. 

Updated Date - 2020-12-30T20:53:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising