టిక్‌టాక్ ప్రో పేరుతో సైబర్ నేరగాళ్ల వల
ABN, First Publish Date - 2020-07-08T08:52:54+05:30
టిక్‌టాక్ ప్రో పేరుతో సైబర్ నేరగాళ్ల వల
తస్మాత్ జాగ్రత్త.. లింక్ క్లిక్ చేేస్త ఖాతా ఖాళీ
హైదరాబాద్,(ఆంధ్రజ్యోతి): టిక్‌టాక్‌ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిషేధించక ముందు.. ఆ యాప్ చాలా మందికి వ్యసనంగా మారిపోయింది. ఆ పాపులారిటీనే ఇప్పుడు సైబర్ నేరగాళ్లు అక్రమ సంపాదనకు వాడుకుంటున్నారు. నకిలీ వెబ్‌సైట్‌తో మోసాలకు తెరతీశారు. టిక్‌టాక్ ప్రో అనే వెబ్‌సైట్ పేరుతో నీలం రంగు లింకులు పంపిస్తున్నారు. వాటిని క్లిక్ చేస్తే.. బ్యాంకు ఖాతాలోని డబ్బులు మాయమైనట్టే. ‘ఇప్పుడు టిక్‌టాక్ వీడియోల్ని ఆస్వాదించండి. అంతేకాదు సృజనాత్మక వీడియోలు మళ్లీ తయారు చేయండి. మీ టిక్‌టాక్ ఇప్పుడు టిక్‌టాక్ ప్రోతో వచ్చేసింది’ అంటూ మెసేజ్‌లు పంపించి వల విసురుతున్నారు. ‘ఆహా.. టిక్‌టాక్ మళ్లీ వచ్చేసిందే’ అనుకుంటూ లింక్‌ను క్లిక్ చేసిన మరుక్షణం మీ బ్యాంకు ఖాతాలోని డబ్బులు సైబర్ నేరగాళ్లకు చేరిపోతాయని తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Updated Date - 2020-07-08T08:52:54+05:30 IST