ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో ముగ్గురు

ABN, First Publish Date - 2020-03-24T11:17:19+05:30

నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా, కల్వకుంట్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోటీలో కవిత, సుభా్‌షరెడ్డి, లక్ష్మీనారాయణ

వచ్చే నెల 7న ఆరు కేంద్రాల్లో పోలింగ్‌


నిజామాబాద్‌/హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా, కల్వకుంట్ల కవిత(టీఆర్‌ఎస్‌), సుభా్‌షరెడ్డి (కాంగ్రెస్‌), లక్ష్మీనారాయణ(బీజేపీ) పోటీలో ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సి.నారాయణరెడ్డి ప్రకటించారు. నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భాగంగా మొత్తం ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో ఇద్దరు అభ్యర్థులు శ్రీనివాస్‌, భాస్కర్‌ నామినేషన్లను పరిశీలన సమయంలోనే అధికారులు తిరస్కరించారు. లోయపల్లి నర్సింగ్‌రావు శనివారం, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి సోమవారం నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.


దీంతో ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. కాగా, ఏప్రిల్‌ 7న ఆరు కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్‌ 9న లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడిస్తారు. ఉపఎన్నికలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి మొత్తం 824 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

Updated Date - 2020-03-24T11:17:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising