ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరేళ్లలో అపూర్వ ప్రగతి

ABN, First Publish Date - 2020-06-03T09:19:46+05:30

ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఉండబట్టే ఆరేళ్లలో తెలంగాణ అపూర్వ ప్రగతి సాధించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేసీఆర్‌ వల్లే ఇది సాధ్యం.. 

అమరుల త్యాగాలు మరువలేనివి..

రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు


వరంగల్‌ రూరల్‌ కలెక్టరేట్‌, జూన్‌ 2: ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఉండబట్టే ఆరేళ్లలో తెలంగాణ అపూర్వ ప్రగతి సాధించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళశారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలం చేయడమే కాక, మిషన్‌ భగీరఽఽథ, మిషన్‌ కాకతీయ పథకాలతో చెరువులకు జలకళ వచ్చిందన్నారు. జిల్లాలో పల్లె ప్రగతి అద్భుతంగా ఉందన్నారు. రైతుల మేలు కోసమే నియంత్రణ సాగు అమలు చేయడం జరుగుతోందన్నారు. కరోనా జిల్లాకు రాకుండా కృషిచేసిన డాక్టర్టు, పోలీసులు, ఇతర అధికారులు సేవలు అభినందనీయమన్నారు. 


టెక్స్‌టైల్స్‌ పార్క్‌ పూర్తయితే ఉపాధి..

కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్కు ఏర్పాటు పూర్తయితే వేలాది మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సీఎం కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. రాష్ట్ర ఏర్పాటులో అమరుల త్యాగాలను మరువలేనివన్నారు. తన 40ఏళ్ల రాజకీయ ప్రస్తానంలో ఎన్నడు తెలంగాణ ప్రాంతంలో జలకళ చూడలేదని, కేసీఆర్‌ పాలన తాను మంత్రిగా ఉన్నందుకు గర్విస్తున్నానన్నారు. కరోనా నివారణ అనంతరం జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో సీపీ విశ్వనాథ్‌ రవీందర్‌, కలెక్టర్‌ ఎం.హరిత, జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్రజ్యోతి, అదనపు కలెక్టర్‌ మహేందర్‌రెడ్డి,ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి, డీసీపీ వెంకటలక్ష్మి, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌, జడ్పీ ప్లోర్‌లీడర్‌ పెద్ది స్వప్న, ఆర్డీఓ మహేందర్‌జీ, రాజయ్య యాదవ్‌, సమ్మారావు, కిషన్‌రావు తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-03T09:19:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising