ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనగామలో దొంగల హల్‌చల్‌.. ఓ ఇంట్లో చోరీ చేసి పరారవుతుండగా..

ABN, First Publish Date - 2020-07-03T17:10:32+05:30

జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్‌ కాలనీలో గురువారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. హైదరాబాద్‌ రోడ్‌లో ఉన్న సంగి రాజేష్‌ అనే వ్యక్తి ఇంటిలోని బీరువాలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జ్యోతినగర్‌ కాలనీలో రూ.7.20 లక్షల బంగారు, వెండి ఆభరణాలు

- రూ.60 వేల నగదు అపహరణ


జనగామ టౌన్‌ (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్‌ కాలనీలో గురువారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. హైదరాబాద్‌ రోడ్‌లో ఉన్న సంగి రాజేష్‌ అనే వ్యక్తి ఇంటిలోని బీరువాలో ఉన్న 15 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు, రూ.60 వేల నగదు అపహరించారు. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. క్రూయిజర్‌ వాహనాన్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న రాజేష్‌ భార్య పిల్లలతో కలిసి జ్యోతినగర్‌ కాలనీలో కిరాయి ఇంట్లో నివసిస్తున్నాడు. బుధవారం రాజేష్‌ తన స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా వెల్మజాలకు వెళ్లాడు.


ఈ క్రమంలో గురువారం దుండగులు ఇంట్లో చోరీచేసి, పరారవుతుండగా స్థానికులు రాజేష్ కు సమాచారం అందించారు. ఈ మేరకు రాజేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. డీసీపీ బి.శ్రీనివా్‌సరెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్‌, సీఐ డి.మల్లేశ్‌యాదవ్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుడి నుంచి వివరాలు తెలుసుకుని క్లూస్‌టీంతో సంఘటన స్థలం పరిశీలించి, దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.

Updated Date - 2020-07-03T17:10:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising