ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ABN, First Publish Date - 2020-12-15T08:13:24+05:30
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల, ఉపాధ్యాయ సంఘం డిమాండ్
పంజాగుట్ట, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల, ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఆలేటి శ్రీశైలం, ఉపాధ్యక్షుడు చిన్న నరసింహులు తదితరులు మాట్లాడారు. ఉద్యోగుల బదిలీలు లేవని, పదోన్నతులు కల్పించడం లేదని, డీఏ, పీఆర్‌సీ, ఐఆర్‌లు ఇవ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత సుమారు లక్ష మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారన్నారు. అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడం లేదని, రాష్ట్రంలో నష్టపోయింది ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులేనని చెప్పారు. ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని తెలిపారు.
Updated Date - 2020-12-15T08:13:24+05:30 IST