ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో పెరుగుతున్న ఐబీడీ సమస్య

ABN, First Publish Date - 2020-05-19T10:30:29+05:30

భారత్‌లో ఇన్‌ఫ్లెమేటరీ బొవెల్‌ వ్యాధి(ఐబీడీ) బారిన పడుతున్న రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి లక్షణాలున్నా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వం మార్గదర్శకాల రూపొందించాలి: నిపుణులు


న్యూఢిల్లీ, మే 18: భారత్‌లో ఇన్‌ఫ్లెమేటరీ బొవెల్‌ వ్యాధి(ఐబీడీ) బారిన పడుతున్న రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి లక్షణాలున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు  ప్రధానకారణమని వారు చెబుతున్నారు. మంగళవారం ప్రపంచ ఐబీడీ అవగాహన దినోత్సవం సందర్భంగా నిపుణులు ఆ వ్యాధి గురించి వివరించారు. కడుపులో మంట, వాంతులు, విరేచనాలు, మలద్వారంలో రక్తం వంటి సూచనలన్నీ ఐబీడీకి చెందినవేనని, ఈ వ్యాధి తీవ్రత గురించి భారతీయులకు అర్థం కావట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐబీడీ ఉన్న రోగులు, రెండుమూడేళ్లపాటు వివిధ వైద్యుల వద్దకు తిరిగిన తర్వాత గానీ ఐబీడీ ఉందని తెలుసుకోలేకపోతున్నారని, ఈలోపు వ్యాధి ముదిరిపోతోందని వివరించారు.


ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక నిర్దిష్ట మార్గదర్శకాలను ఏర్పాటుచేసి, వ్యాధి చికిత్సలో ఖర్చును తగ్గించేలా చూడాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఐబీడీపై మరిన్ని పరిశోధనలు జరగాలని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషిచేయాలని సూచించారు. ఆసియాలో భారత్‌లోనే అత్యంత ఎక్కువగా ఐబీడీ వ్యాధిగ్రస్తులున్నారని, ముఖ్యంగా 20-30 ఏళ్ల మధ్యవారు దాని బారిన పడుతున్నారని వివరించారు.

Updated Date - 2020-05-19T10:30:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising