ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోగికి ఉన్నాయి ఎన్నో హక్కులు

ABN, First Publish Date - 2020-07-02T09:27:55+05:30

కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరమొచ్చి ఆస్పత్రికి వెళితే అక్కడ వైద్యం చేసే పరిస్థితి లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆస్పత్రికి వస్తే వైద్య చికిత్స అందించాలి... చికిత్స పద్ధతులు, ధరలను చెప్పాలి

వ్యాధి ఏమిటనేది వివరించాలి

కేస్‌ షీట్స్‌ అడిగితే అందజేయాలి


హైదరాబాద్‌ సిటీ, జూలై 1 (ఆంధ్రజ్యోతి): కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరమొచ్చి ఆస్పత్రికి వెళితే అక్కడ వైద్యం చేసే పరిస్థితి లేదు. కనీసం గేటు లోపలికి కూడా రానివ్వకుండా మరో ఆస్పత్రికి వెళ్లండంటూ పంపించి వేస్తున్నారు. అక్కడి నుంచి ఇంకో ఆస్పత్రికి వెళితే వారి నుంచీ అదే సమాధానం!! అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందాల్సిన వారి పరిస్థితైతే మరీ దయనీయంగా ఉంటోంది. వైర్‌సకు జడిసి చికిత్స అందించేందుకు ముందుకు రావడంలేదు. కొందరిని అడ్మిట్‌ చేసుకుంటున్నా వారికి ఎలాంటి వైద్యాన్ని అందిస్తున్నారు? అక్కడ ఉన్న సదపాయాలేమిటి? అనేవి చెప్పడం లేదు. అయితే  ఆపదలో ఆస్పత్రికి వచ్చిన రోగిని తిప్పి పంపించడం సరికాదని, రోగులకు కొన్ని హక్కులుంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ, ప్రతి చోట హక్కుల గురించి తెలుసుకోవడం ముఖ్యమని పేర్కొంటున్నారు. రోగుల హక్కుల చార్టర్‌లో ఈ హక్కులను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వివరించింది. ఆ వివరాలు.. 


సమాచార హక్కు 

రోగి  ఎదుర్కొంటున్న సమస్యలను వైద్యులు గుర్తిం చి వారికి సమాచారమందించాలి. రోగి అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే వెంట వచ్చిన సహాయకుడికి అం దించాలి. అదీ వారికి అర్థమయ్యే భాషలోనే చెప్పాలి. చికిత్సలందిచే వైద్యులు, నిపుణుల గుర్తింపు, వృత్తిపరమైన స్థితి గురించి తెలుసుకునే హక్కు రోగులకు ఉంది. వైద్యానికి అయ్యే ఖర్చులకు సంబంధించిన సమాచారం లఖిత పూర్వకంగా అందించాలి. 


నివేదికలు పొందే హక్కు

అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ, లేదా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్య సంరక్షణ పొందే హక్కు రోగులకు ఉంది. రోగికి సంబంధించిన రికార్డులు, వ్యాధుల నిర్ధారణ ఫలితాల నివేదికలు, కేస్‌ షీట్స్‌, కేసును పరిశీలించి అంతర్గతంగా నిర్వహించిన ఫలితాలకు సంబంధించిన నివేదికల పత్రాలను రోగులు, వారి సహయకులు పొందే హక్కు ఉంది. వ్యాధి నిర్ధారణ కేసు పరిశీలన పత్రాలను అడ్మిషన్‌ జరిగిన 24 గంటలు, లేదా డిశ్చార్జి అయిన 72 గంటల్లోగా అందించాలి. రోగి మరణిస్తే దానికి సంబంధించిన నివేదికలును అసలు కాపీలతో రోగి సంరక్షకులకు లేదా బంధువులకు ఇవ్వాలి.  

సమాచారం ఇచ్చే హక్కు

ఒక రోగిని ఆపరేషన్‌, కిమోథెరపీకి తీసుకెళ్లాలని ఆస్పత్రి వర్గాలు నిర్ణయిస్తే, త గిన విధివిధానాలు పూర్తి చేయడం, వాటి వల్ల ఎదురయ్యే ఇబ్బందులను రోగి లేదా సంరక్షుడికి చెప్పిన తర్వాతే ప్రక్రియను చే పట్టాలి. చికిత్సకయ్యే ఖర్చునూ వివరించాలి.  


రెండో అభిప్రాయానికి హక్కు

రోగి లేదా సంరక్షకులకు నచ్చిన డాక్టర్‌ లేదా మరో ఆస్పత్రి నుంచి  రెండో అభిప్రాయాన్ని (సెకండ్‌ ఒపీనియన్‌)ను ఆశిస్తే వారి నిర్ణయాన్ని వైద్యులు, ఆస్పత్రి వర్గాలు గౌరవించాలి. ఈ విషయంలో వారిని వారించడం,  నిరుత్సాహపర్చడం వంటివి చేయొద్దు.   


ధరల పారదర్శక హక్కు

ఆస్పత్రిలో రోగి చికిత్సకు అయ్యే వైద్య ఖర్చుల వివరాలను నోటిసు బోర్డుల రూపంలో ఏర్పాటు చేయాలి. ధరలను తెలుసుకోవడం రోగి హక్కు. ఆయా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న చికిత్స పద్ధతులు దానికి వసూలు చేసే ధరలను ప్రింటెడ్‌ బ్రోచర్ల రూపంలో ఇంగ్లిషు, స్థానిక  భాషల్లో అందించడం, నోటిసు బోర్డులో అందరికి కనిపించే విధంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 


గోప్యత, గౌరవం హక్కు

రోగికి చికిత్స విషయంలో గోప్యత హక్కు ముఖ్యమైనది. రోగికి ఉన్న అనారోగ్య సమస్య ఏమిటి? చికిత్స ప్రణాళిక గురించి సమాచారాన్ని వైద్యులు గోప్యంగా ఉంచాల్సిన అవసరముంది. అసాధారణమైన సందర్భంలో తప్ప, సమచారాన్ని పంచుకోవడం, ఇతరులను రక్షించే ఆసక్తితో వెల్లడించడం చేయొద్దు.  మహిళా రోగులకు తమకు మహిళ నిపుణుల ద్వారానే వైద్యం ఇప్పించాలని ఆశించే హక్కు ఉంది. రోగుల గౌరవాన్ని నిలబబెట్టడానికి ఆస్పత్రి బాధ్యత వహించాల్సి ఉంటుంది. రోగి విషయంలో వారి అనారోగ్యం, పరిస్థితి, హెచ్‌ఐవీ స్థితి, వయసు, కులం, జాతి, భాషా, భౌగోళిక, సామాజిక మూలాల ఆధారంగా ఎలాంటి వివక్షత చూపకూడదు.  రోగులకు భద్రత పొందే హక్కు ఉంటుంది. పారిశుధ్య సదుపాయాలు కల్పించాలి. 


సరైన రిఫరల్‌, బదిలీ హక్కు

ఒక రోగిని తప్పనిసరిగా ఒక ఆరోగ్య కేంద్రం నుంచి మరొక ఆరోగ్య కేంద్రానికి బదిలీ చేస్తే, వారికి, సంరక్షకులకు కొత్త ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి సంబంధించి వివరించాల్సి ఉంటుంది. బదిలీ తర్వాత కొనసాగించాల్సిన చికిత్సలు, మందుల జాబితాను కూడా వారికి ఇవ్వాలి. రోగి లేదా వారి సంరక్షకుడు అంగీకరిచకపోతే ఈ చర్య తీసుకోవడానికి అవకాశం లేదు. అన్ని క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రొటోకాల్స్‌, సేవలు, ప్రభుత్వం జారీ చేసిన మంచి క్లినికల్‌ ప్రాక్టీస్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలి.  ఇక రోగి బయోమెడికల్‌ లేదా ఆరోగ్య పరిశోధన విధానంలో పాల్గొన్నట్లయితే వారి సమ్మతిని రాతపూర్వకంగా తీసుకోవాల్సి ఉంటుంది.  రోగికి డిశ్చార్జి అయ్యే హక్కు ఉంది. ఇంటికి వెళతానంటే నిర్బంధించకూడదు. రోగి మృతదేహాన్ని అప్పగించే విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. మృతదేహాన్ని పొందే హక్కు సంరక్షకులకు ఉంటుంది. 

Updated Date - 2020-07-02T09:27:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising