ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘దిశ ఎన్‌కౌంటర్‌’ సినిమా నిలిపివేయాలి

ABN, First Publish Date - 2020-11-03T08:16:46+05:30

దిశ కేసులో ఎన్‌కౌంటర్‌ ఆధారంగా నిర్మిస్తున్న ‘దిశ ఎన్‌కౌంటర్‌’ సినిమాను నిలిపివేయాలని ఆ కేసులో నిందితుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వర్మ కార్యాలయం వద్ద నిందితుల కుటుంబ సభ్యుల ఆందోళన   

బంజారాహిల్స్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): దిశ కేసులో ఎన్‌కౌంటర్‌ ఆధారంగా నిర్మిస్తున్న ‘దిశ ఎన్‌కౌంటర్‌’ సినిమాను నిలిపివేయాలని  ఆ కేసులో నిందితుల కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. జూబ్లీహిల్స్‌లోని దర్శకుడు రాంగోపాల్‌వర్మ కార్యాలయం వద్ద వారు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ కేసులో  జోళ్లు శివ, జోళ్లు నవీన్‌, చెన్న కేశవులు, హైమద్‌ అరీఫ్‌ నిందితులన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను నిలిపివేయాలని జ్యుడిషియల్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు నిందితుడు చెన్నకేశవులు భార్య చెప్పారు.


ఎన్‌కౌంటర్‌ అయ్యాక తమ కుటుంబాలు కోలుకోలేక పోతున్నాయన్నారు.  ఈ క్రమంలో సినిమా ద్వారా మరోసారి తమ వారిని విలన్‌ల మాదిరి చూపించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ఈ చిత్రం విడుదల చేస్తే తమ కుటుంబాలు కోర్టు సాక్షిగా ఆత్మహత్య చేసుకుంటాయని హెచ్చరించారు. రాంగోపాల్‌వర్మ వచ్చి తమ కుటుంబం నేపథ్యం అడిగినప్పుడు సినిమా గురించి చెప్పలేదన్నారు.  ఇప్పటికే ఈ చిత్రాన్ని ఆపాలని  దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.


Updated Date - 2020-11-03T08:16:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising