ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మిన భూమిని కూతుళ్ల పేరిట గిఫ్ట్‌ డీడ్‌

ABN, First Publish Date - 2020-12-19T07:03:40+05:30

గతంలో ఒకరికి అమ్మిన భూమిని తాజాగా ధరణిలో మరొకరికి రిజిస్ట్రేషన్‌ చేసిన ఉదంతం ఇంకోటి వెలుగులోకి వచ్చింది. మెదక్‌ జిల్లా కొల్చారం మండలం రాంపూర్‌ గ్రామసర్పంచ్‌ పట్లోరి రాంరెడ్డికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొల్చారం మండలం రాంపూర్‌ సర్పంచ్‌ రాంరెడ్డి నిర్వాకం

మోసం చేశారంటూ.. పోలీసులకు బాధితుడి ఫిర్యాదు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌ /కొల్చారం, డిసెంబరు 18: గతంలో ఒకరికి అమ్మిన భూమిని తాజాగా ధరణిలో మరొకరికి రిజిస్ట్రేషన్‌ చేసిన ఉదంతం ఇంకోటి వెలుగులోకి వచ్చింది. మెదక్‌ జిల్లా కొల్చారం మండలం రాంపూర్‌ గ్రామసర్పంచ్‌ పట్లోరి రాంరెడ్డికి గ్రామంలోని సర్వే నెంబర్లు 360, 361, 363, 364 లలో 5.15 ఎకరాలు భూమి తన పేరిట ఉంది. ఆ భూమిని 2019 మార్చి 25న మెదక్‌ పట్టణానికి చెందిన చంద్రశేఖర్‌ అనే వైద్యుడు రాంరెడ్డి నుంచి కొనుగోలు చేసి సేల్‌ డీడ్‌ చేసుకున్నారు. రికార్డుల్లో భూ యాజమాన్యం పేరు మార్పు(మ్యుటేషన్‌) కోసం చంద్రశేఖర్‌ అదే ఏడాది అక్టోబరులో మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. మ్యుటేషన్‌ పెండింగ్‌లో ఉండిపోయింది. 


ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన ధరణి పోర్టల్‌లో సదరు భూమి రాంరెడ్డి పేరిటే కనిపిస్తోంది. నవంబరు 2న ధరణి పోర్టల్‌ ప్రారంభం కాగా, 3వ తేదీన 5.15 ఎకరాల భూమిని తన ఇద్దరు కూతుళ్లు మనూషరెడ్డి, అనూషరెడ్డిల పేరిట గిఫ్ట్‌డీడ్‌ చేశాడు. దీంతో రాంరెడ్డిపై చీటింగ్‌ కేసు నమోదు చేయాలంటూ బాధితుడు చంద్రశేఖర్‌ కొల్చారం పోలీసు స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.

అదేవిధంగా సరైన పత్రాలు లేకున్నా రిజిస్ట్రేషన్‌ చేసిన ఇన్‌చార్జి తహసీల్దార్‌ ప్రదీ్‌పకుమార్‌పైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ న ర్సాపూర్‌ ఇన్‌చార్జి ఆర్డీవో సాయురాంకు ఫిర్యాదు చేశారు. కాగా, చంద్రశేఖర్‌ ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని కొల్చారం ఎస్‌ఐ శ్రీనివా్‌సగౌడ్‌ తెలిపారు. ఈ విషయంపై నర్సాపూర్‌ ఆర్డీవో సాయిరాంను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా విచారణ జరిపిస్తామని అన్నారు.


Updated Date - 2020-12-19T07:03:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising