మీ చట్టాలను మీరే ఎందుకు అమలు చేయరు?
ABN, First Publish Date - 2020-08-22T08:45:00+05:30
రైతులను ఆదుకునేందుకు రూపొందించిన స్వీయ చట్టాలు, నిబంధనలను ఎందుకు అమలు చేయడం
- ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ధర్మాసనం
హైదరాబాద్, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): రైతులను ఆదుకునేందుకు రూపొందించిన స్వీయ చట్టాలు, నిబంధనలను ఎందుకు అమలు చేయడం లేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిబంధనలు అమలు చేయడానికి ఏం చర్యలు తీసుకోనున్నారో సోమవారం చెప్పాలని హైకోర్టు స్పష్టం చేసింది. పత్తివిత్తనాలు పండించే రైతులు దోపిడీకి గురవుతున్నారని, విత్తన సంస్థలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ గద్వాల్ జిల్లాకు చెందిన జి. రంజిత్ కుమార్ హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యాన్ని ద్విసభ్య ధర్మాస నం విచారించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎన్. అర్జున్‌కుమార్ వాదించారు. ప్రభుత్వం చేసిన చట్టాన్ని అమలు చేస్తే రైతులు దగాపడకుం డా కాపాడవచ్చని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. పభుత్వం స్వీయ చట్టాలను ఎందుకు అమలు చేయడం లేదని ధర్మాసనం ఏజీ బీఎస్ ప్రసాద్‌ను ప్రశ్నించింది. ప్రభుత్వ వివరణ తీసుకుని చెప్పేందుకు ఏజీకి గడువిచ్చింది.
Updated Date - 2020-08-22T08:45:00+05:30 IST