ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యాన్ని ప్రభుత్వమే అలవాటు చేసిందనడం సరికాదు: శ్రీనివాస్‌గౌడ్‌

ABN, First Publish Date - 2020-04-01T19:52:46+05:30

కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌లో భాగంగా మద్యం షాపులు మూసివేశామని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌లో భాగంగా మద్యం షాపులు మూసివేశామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ప్రతి రోజు మద్యం తాగేవాళ్లు ఆందోళనకు గురవడం సహజమని అన్నారు. మద్యాన్ని ప్రభుత్వమే అలవాటు చేసిందనడం సరికాదన్నారు. మద్యం ప్రియులు తమ దృష్టిని మరో విషయంపై మళ్లించాలని సూచించారు. కుటుంబసభ్యులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 


ఏదైనా పరిమితికి మించి తీసుకుంటే ప్రమాదకరమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. మద్యం దొరక్కపోతే అక్రమ మార్గాల్లో తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారని, అలవాటుపడినవాళ్ల కోసం మద్యం పంపిణీపై ఆలోచన చేస్తామన్నారు. ఏదైనా చేస్తే విపక్షాలు దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయని శ్రీనివాస్‌గౌడ్‌ ఏబీఎన్‌తో అన్నారు.

Updated Date - 2020-04-01T19:52:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising