ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

73 రోజుల విరామం తర్వాత తెలంగాణలో తొలి పరీక్ష

ABN, First Publish Date - 2020-06-03T16:58:01+05:30

లాక్ డౌన్‌తో 73 రోజుల విరామం తర్వాత బుధవారం తెలంగాణలో తొలి పరీక్ష జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: లాక్ డౌన్‌తో 73 రోజుల విరామం తర్వాత బుధవారం తెలంగాణలో తొలి పరీక్ష జరుగుతోంది. ఇంటర్ జాగ్రఫీ-2, మోడ్రన్ లాంగ్వేజీ-2 పరీక్షలను అధికారులు నిర్వహిస్తున్నారు. మాస్కులను ధరించిన విద్యార్థులనే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లే ముందు విద్యార్థులకు థర్మాల్ స్క్రీనింగ్ నిర్వహించారు. అన్ని కేంద్రాల్లోనూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. 


తెలంగాణలోని 12 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. గత పరీక్షా కేంద్రాల్లోనే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను గంట ముందు నుంచే అనుమతించారు. 15 నిముషాలు ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు. ఈ పరీక్షకు హాజరుకానివారు వచ్చే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చు. రెగ్యులర్ విద్యార్థులగానే పరిగణిస్తామని అధికారులు తెలిపారు. అలాగే పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా పరిస్థితుల మధ్య పరీక్షలను తగిన జాగ్రత్తలతో నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - 2020-06-03T16:58:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising