అమ్మ పొత్తిళ్లలోనే ఆన్‌లైన్ క్లాసులు అవసరమా?
ABN, First Publish Date - 2020-09-15T01:10:01+05:30
కరోనా కారణంగా స్కూలు పిల్లలకు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చిన విషయం తెలిసిందే...
కరోనా కారణంగా స్కూలు పిల్లలకు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. పాఠశాలలు ఇప్పటికే ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అయితే స్కూలు ఫీజుల విషయంపై తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫీజులు బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ పిల్లలకు ఆన్‌లైన్‌లో క్లాసులు అర్థంకావడంలేదని అంటున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు స్కూలు బలవంతంగా ఫీజులు చేస్తోందని సినీ నటుడు శివ బాలాజీ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ‘‘అమ్మ పొత్తిళ్లలోనే ఆన్‌లైన్ క్లాసులు అవసరమా?. పిల్లలపై ప్రేమతోనే ఆన్‌లైన్ రాద్దాంతమా?. ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పోతుందనే ఆందోళనా?. ఇష్టారాజ్యాంగా పెంచేస్తున్న స్కూల్ ఫీజులకు బాధ్యులెవరు?. అమ్మానాన్నల ఆరాటాన్ని స్కూళ్లు వాడుకుంటున్నాయా?. ఆన్ లైన్ క్లాసులు పిల్లల హక్కులను హరిస్తున్నాయా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్‌ను వీడియో ద్వారా వీక్షించొచ్చు.
Updated Date - 2020-09-15T01:10:01+05:30 IST