ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీధుల్లో నల్లగా తిరిగిన కరోనా భూతం

ABN, First Publish Date - 2020-04-01T18:19:15+05:30

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్‌ను ఉల్లంఘిస్తూ రాష్ట్రంలో ప్రజలు, వాహనదారులు చాలా ప్రాంతాల్లో రహదారులపైకి వస్తుండడంతో వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నేను సయితం అంటూ స్వచ్చంధ సేవా వ్యవస్థాపక అధ్యక్షుడు మహ్మద్ సుభానీ వినూత్న కార్యక్రమం చేపట్టారు. వంటినిండా నల్లరంగు పూసుకుని కరోనా భూతం వేషధారణతో.. చేతిలో గండ్రగొడ్డలి పట్టుకుని రహదారులపై తిరుగుతూ.. వచ్చిపోయే వాహనదారులు, ప్రజలకు కరచాలనం చేయబోయాడు. అందరూ భయపడి కరచాలనం చేయడానికి ముందుకు రాలేదు. రంగంటుకుంటుందని భయపడుతున్నారు. మరి కరోనా వైరస్ అంటుకుంటే పరిస్థితి ఏంటని వారిని ప్రశ్నించాడు. 


ఈ సందర్భంగా మహ్మద్ సుభానీ మాట్లాడుతూ కరోనా వైరస్ చైనా దేశంలోని వూహాన్‌లో పుట్టి ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించిందని, ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించి, పోలీసులు 24 గంటలూ పనిచేస్తున్నా.. వారిని పట్టించుకోకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారని, వారిలో మార్పు తెచ్చేందుకు ఈ విధంగా చేశానని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు కరోనా వ్యాధి ఏ విధంగా అంటుకుంటుందో తెలుసుకుని బయటకు రాకుండా ఇంట్లోనే ఉండి ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కోరారు.

Updated Date - 2020-04-01T18:19:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising