మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిసిన గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు
ABN, First Publish Date - 2020-09-20T01:21:07+05:30
వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణకు కృషి చేసిన రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు కలిశారు.
హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణకు కృషి చేసిన రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు కలిశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటయ్య గారి ఆధ్వర్యంలో సంఘ కార్యవర్గ సభ్యులు మంత్రిని కలసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమత పాల్గొన్నారు.
వాణిజ్య పన్నుల శాఖను పటిష్టం చేసేందుకు , పన్నుల రాబడులను, పాలన సౌలభ్యం కోసం వాణిజ్య పన్నుల శాఖ ను పునర్వ్యవస్థీకరణ లో భాగంగా 18 వాణిజ్య పన్నుల సర్కిళ్ళు, మరో 161 నూతన పోస్టులను ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు అసోసియేషన్ తరుపున ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ ఆదాయంలో సింహాభాగం అందిస్తున్న వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచటానికి అంకితభావంతో పానిచేస్తామని సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటయ్య మంత్రికి శ్రీనివాస్ గౌడ్కు వివరించారు. అంతేగాకుండా సీఎం కేసీఆర్ వాణిజ్య పన్నుల శాఖ పై తీసుకున్న సానుకూల నిర్ణయం పట్ల ఉద్యోగులు మరింత ఉత్సాహం తో పనిచేస్తామని ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు.
Updated Date - 2020-09-20T01:21:07+05:30 IST