ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

ABN, First Publish Date - 2020-11-14T01:03:08+05:30

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని కాంటినెంటల్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగూనాయక్ (42) అనే వ్యక్తి మృతిచెందాడు. చనిపోయి రెండ్రోజులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని కాంటినెంటల్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగూనాయక్ (42) అనే వ్యక్తి మృతిచెందాడు. చనిపోయి రెండ్రోజులు గడిచినా తమకు సమాచారం తెలియజేయలేదంటూ ఆస్పత్రి ఎదుట మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. మంగూనాయక్‌ను హైబీపీతో గత నెల 31న కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటి వరకు ఆస్పత్రికి 8 లక్షల బిల్లును మంగూనాయక్ కుటుంబ సభ్యులు కట్టారు. మరో ఆరు లక్షలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ ఆస్పత్రి సిబ్బంది అడ్డుపడ్డారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు.



Updated Date - 2020-11-14T01:03:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising