ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌-ముంబై బుల్లెట్‌ ట్రెయిన్‌ డీపీఆర్‌కు టెండర్లు

ABN, First Publish Date - 2020-11-03T08:18:34+05:30

హైదరాబాద్‌-పుణె-ముంబై మధ్య ప్రారంభించబోయే బుల్లెట్‌ ట్రెయిన్‌ డీపీఆర్‌ తయారీ బిడ్లను ఈ నెల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 18న తెరచుకోనున్న బిడ్లు, 5న ప్రీబిడ్‌ భేటీ

 బుల్లెట్‌ ట్రెయిన్‌తో 3.50 గంటల్లోనే ముంబైకి..

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌-పుణె-ముంబై మధ్య ప్రారంభించబోయే బుల్లెట్‌ ట్రెయిన్‌ డీపీఆర్‌ తయారీ బిడ్లను ఈ నెల 18న తెరవనున్నారు. ప్రీబిడ్‌ సమావేశం ఈ నెల 5న జరగనుంది. రైల్వే బోర్డు ఆదేశానుసారం ఈ డీపీఆర్‌ తయారీకి నేషనల్‌ హై స్పీడ్‌ రెయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) టెండర్లను ఆహ్వానించింది.


గంటకు 320కిలో మీటర్ల వేగంతో పరుగెత్తే బుల్లెట్‌ ట్రెయిన్లను ఏడు కారిడార్లలో ప్రారంభించాలని కేంద్ర రైల్వే బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఏడింటికి ఎన్‌హెచ్‌ఎస్‌సీఆర్‌సీఎల్‌ డీపీఆర్‌లను తయారు చేయించనుంది. ఇందులో 711 కిలో మీటర్ల హైదరాబాద్‌-పుణె-ముంబై కారిడార్‌ ఒకటి. బుల్లెట్‌ ట్రెయిన్‌తో హైదరాబాద్‌-ముంబై మధ్య 3.50 గంటల్లోనే ప్రయాణించవచ్చు.

ప్రస్తుతం సగటున 80 నుంచి 120 కిలో మీటర్ల వేగంతో వెళుతున్న రైళ్లలో హైదరాబాద్‌ నుంచి ముంబైకి ప్రయాణించాలంటే 13 గంటల సమయం పడుతుంది. బుల్లెట్‌ ట్రెయిన్‌తో ఏకంగా 9.50 గంటల సమయం తగ్గుతుంది. 


Updated Date - 2020-11-03T08:18:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising