ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలం గట్టు గొడవ..ఒకరి హత్య.. పది మంది అరెస్ట్..

ABN, First Publish Date - 2020-08-07T17:14:22+05:30

మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం రౌతుగూడెం గ్రామంలో ఈ నెల 4న జరిగిన అంగోతు బాలు హత్య కేసులో 10 మందిని అరెస్ట్‌ చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్‌ క్రైం(ఆంధ్రజ్యోతి) : మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం రౌతుగూడెం గ్రామంలో ఈ నెల 4న జరిగిన అంగోతు బాలు హత్య కేసులో 10 మందిని అరెస్ట్‌ చేశారు.   మహబూబాబాద్‌ డీఎస్పీ కార్యాలయంలో గురువారం ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వెల్లడించిన వివరాల మేరకు.. రౌతుగూడెం గ్రామానికి చెందిన గుగులోతు రవి వ్యవసాయ భూమిని  ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆంగోతు చందు ట్రాక్టర్‌తో దున్నుతుండగా పక్కనే ఉన్న ఆంగోతు హథీరాం భూమి గెట్టు ఓడ్డు చెదిరిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన హథీరాం సంబంధికులు 10 మంది చందుపై దాడి చేశారు. చందు తండ్రి బాలు అక్కడికి చేరుకొని గొడవ సద్దుమణిగేలా వారికి సర్దిచెప్పారు. 


చెదిరిపోయిన పొలం గట్టును సరిదిద్దుతానని హమీ ఇచ్చారు. అయినా హథీరాం వర్గీయులు అదే రోజు సాయంత్రం చందు, బాలుపై దాడి చేశారు. మరుసటి రోజు ఉదయం బాలు కొత్తగూడ మండలకేంద్రానికి వెళ్లి తిరిగివస్తుండగా హథీరాం బంధువులు అంగోతు బాబులాల్‌, చందులాల్‌, హనుమా, మోహన్‌, భూక్య సంమ్మిలాల్‌, అంగోతు హస్లీ, ఆంగోతు ఈర్వా, బుజ్జి, భద్రమ్మ మూకుమ్మడిగా బాలుపై దాడి చేసి హతమార్చారు. 10 మందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలించారు. ఈ కేసులో చాకచక్యంగా నిందితులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్న  సీఐ బాలాజీ, ఎస్సై తాహర్‌బాబాలను ఎస్పీ అభినందించారు. డీఎస్పీ నరేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-07T17:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising