అప్పుల్లో ఆరో స్థానంలో తెలంగాణ
ABN, First Publish Date - 2020-11-13T08:59:59+05:30
దేశంలో అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం ఆరవ స్థానంలో నిలిచింది.
ఆర్నెల్లలో 22వేల కోట్ల అప్పులు..
ఆర్బీఐ నివేదికలో వెల్లడి
దేశంలో అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం ఆరవ స్థానంలో నిలిచింది. అలాగే, ఓవర్ డ్రాఫ్ట్, స్పెషల్ డ్రాయింగ్ వంటి అవకాశాలను తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణంగా వినియోగించుకుంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు మాసాలు ఆయా రాష్ట్రాలు చేసిన అప్పులు, ఇతర అంశాలకు సంబంధించి ఆర్బీఐ తాజాగా నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం.. తెలంగాణ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి వీలుగా ఇతర అవకాశాలను కూడా పూర్తిగా వినియోగించుకుంది.
ఈ ఏడాది ప్రవే శపెట్టిన బడ్జెట్ సుమారు రూ.1.82 లక్షల కోట్లుగా అంచనా వేశారు. కరోనా కారణంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో సుమారు రూ.52 వేల కోట్ల నష్టం వచ్చినట్లు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అంటే బడ్జెట్‌లో ఈ మేర కోత వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలోని అంశాలను పరిశీలించినా ఇదే విషయం స్పష్టమవుతోంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు వరకు బహిరంగ మార్కెట్ నుంచి తెలంగాణ రాష్ట్రం రూ.22,961 కోట్ల రుణాన్ని తీసుకుంది. సెప్టెంబరులో 30 రోజుల పాటు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద రూ.1,240 కోట్లు, వేస్ అండ్ మీన్స్ కింద రూ.1,576 కోట్లు, ఓవర్ డ్రాఫ్ట్ కింద 21 రోజుల పాటు రూ.698 కోట్లు ఉపయోగించుకుంది.
Updated Date - 2020-11-13T08:59:59+05:30 IST